: బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టిన ‘పీకే’: రూ.544 కోట్లు వసూలు
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా సంచలనం ‘పీకే’ భారతీయ చలన చిత్ర వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది. డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి మొత్తం రూ.544 కోట్లు వసూలు చేసింది. ఇప్పటిదాకా రూ.542 కోట్లతో అత్యధిక వసూళ్ల రికార్డు ఆమిర్ చిత్రం ‘ధూమ్-3’పై ఉంది. తాజాగా తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. ‘పీకే’ వసూళ్లో ఓవర్సీస్ వసూళ్లే రూ.134 కోట్లు ఉన్నాయట.
చిత్రంలో హిందూ మతాన్ని కించపరుస్తున్న దృశ్యాలున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, చిత్ర ప్రదర్శన మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది. త్వరలోనే రూ.600 కోట్ల మార్కును కూడా ఈ చిత్రం సులభంగా సాధిస్తుందని సినీ పండితులు చెబుతున్నారు.