: ఎంసెట్ వివాదాన్ని గవర్నర్ పరిష్కరించలేకపోయారా?

ఎంసెట్ నిర్వహణ వివాదం నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశంలో ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేకపోయారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలతో తేలిపోయింది. సమావేశానంతరం రాజ్ భవన్ నుంచి బయటకు వెళ్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు గంటా శ్రీనివాసరావు ముక్తసరిగా సమాధానాలిచ్చారు. మరోవైపు, మీడియాతో మాట్లాడకుండా టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లిపోయారు. ఇరు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని గవర్నర్ ను కోరినట్టు గంటా తెలిపారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను గవర్నర్ తీసుకున్నారని... అవసరమైతే ఈ అంశంపై మరోసారి చర్చించేందుకు తాము సిద్ధమని అన్నారు. గవర్నర్ నిర్ణయం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. గవర్నర్ తో జరిగిన చర్చల సారాంశాన్ని ఇప్పుడే వెల్లడించలేనని... పూర్తి స్థాయిలో ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.

More Telugu News