: ఆస్ట్రేలియా అడవుల్లో రగులుతున్న అగ్ని... భయం గుప్పిట విక్టోరియా ప్రజలు
ఆస్ట్రేలియా దక్షిణ ప్రాంతంలోని విక్టోరియా రాష్ట్రంలో ఉన్న అడవులను కార్చిచ్చు దహిస్తోంది. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ఈ ప్రమాదంలో ఆరు ఇళ్ళు తగలబడ్డట్టు తెలుస్తోంది. మంటలను ఆర్పడానికి సుమారు 500 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, వేగంగా గాలి వీస్తుండటం, 40 డిగ్రీల సెల్సియస్ ను మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, మంటలను అదుపు చేయడం ఇబ్బందికరంగా మారింది. దాంతో 11 విమానాల ద్వారా మంటలపై నీళ్ళు చల్లుతున్నారు. వీటికి అదనంగా 40 ట్రక్ లు సేవలందిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వేసవి కావడంతో అడవులకు మంటలు చెలరేగడం సహజమే!