: అప్పట్లో 'ఇస్తాంబుల్' అన్న కేసీఆర్ ఇప్పుడు 'డల్లాస్' అంటున్నారు: షబ్బీర్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏడు నెలల పాలనలో వారానికో వాగ్దానం చేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. అయితే, వాటిలో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అప్పట్లో హైదరాబాదును ఇస్తాంబుల్ చేస్తానన్న కేసీఆర్... ఇప్పుడు డల్లాస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. నగర అభివృద్ధిపై 20కిపైగా చేసిన హామీల్లో ఒక్కటీ మొదలు పెట్టలేదన్నారు. హామీల అమలుకు రెండు లక్షల కోట్లు అవసరం అన్నారని చెప్పారు. కాగా, నిజాంపై సీఎం వ్యాఖ్యలను షబ్బీర్ సమర్థించారు. హైదరాబాదు అభివృద్ధి విషయంలో నిజాం పాలన ప్రశంసనీయమని పేర్కొన్నారు.