: సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటబోయి...!
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ యువకుడిని వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. స్టేషన్ లోని ప్రయాణికులు చూస్తుండగానే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు.