: 'నీతి ఆయోగ్' అంటే రాష్ట్రాలకు ప్రాధాన్యమివ్వడమే: దత్తాత్రేయ
'నీతి ఆయోగ్' అంటే రాష్ట్రాలకు ప్రాధాన్యమివ్వడమేనని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో 5కె రన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీతి ఆయోగ్ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వక్రభాష్యం చెబుతున్నాయని అన్నారు. రాజకీయాలు చేసేందుకు ప్రతిపక్షాలకు మరో నాలుగేళ్ల సమయం ఉందని ఆయన సూచించారు. నీతి ఆయోగ్ అంటే అభివృద్ధి, సుపరిపాలన, అధికార వికేంద్రీకరణ కోసమేనని దత్తాత్రేయ తెలిపారు.