: నిరుద్యోగుల జీవితాలతో టీఎస్ ప్రభుత్వం ఆడుకుంటోంది: పొంగులేటి సుధాకర్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయినా ఇంత వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడలేదని విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థులు వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ లు తీసుకుంటున్నారని... ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువడకపోతే వారంతా చాలా నష్టపోతారని చెప్పారు. ఇప్పుడున్న సిలబస్ తోనే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.