: చంద్రబాబుతో రిలయన్స్, ఐటీసీ, వాల్ మార్ట్ ప్రతినిధుల భేటీ!

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో రిటైల్ రంగ దిగ్గజాలు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యాయి. వారిలో రిలయన్స్, ఐటీసీ, వాల్ మార్ట్ లాంటి దేశీయ, అంతర్జాతీయ చిల్లర వ్యాపార సంస్థలతో పాటు లైఫ్ స్టైల్ సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో రిటైల్ రంగ విస్తరణకు సంబంధించి చంద్రబాబుతో సదరు కంపెనీలు చర్చలు నిర్వహించినట్లు సమాచారం. కొత్త రాష్ట్రంలో చిల్లర వ్యాపార రంగానికి సంబంధించి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీలు ఆసక్తి కనబరచినట్లు తెలుస్తోంది.

More Telugu News