: విజయనగరం జడ్పీ సమావేశంలో నిరసన జ్వాలలు
విజయనగరం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే వైకాపా సభ్యులు నిరసనకు దిగారు. జిల్లాలో గిరిజన వర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మీటింగ్ హాల్ లో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కలిసి గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.