: 'పీకే' చిత్రానికి బీహార్లో పన్ను మినహాయింపు

అమీర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాకు బీహార్లో పన్ను మినహాయింపునిచ్చారు. ఈ మేరకు బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝి గురువారం నాడు ప్రకటించారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపునిచ్చిన రెండో రాష్ట్రం బీహార్. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ కూడా పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 'పీకే' చిత్రంపై మత సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన వెలిబుచ్చుతున్నా వెనుకాడకుండా, యూపీ, బీహార్ పన్ను మినహాయింపునివ్వడం విశేషం. మాజీ సీఎం నితీశ్ కుమార్ సూచన మేరకే తామీ నిర్ణయం తీసుకున్నామని మాంఝి తెలిపారు. ఇక ఈ సినిమాను పేదవాళ్లు సైతం చూడొచ్చని అన్నారు. మతం పేరిట సాగుతున్న మూఢనమ్మకాలు, అవినీతిని ఈ సినిమాలో బట్టబయలు చేశారని వివరించారు.

More Telugu News