: హైదరాబాద్ లో మరింత విస్తరించిన స్వైన్ ఫ్లూ... మరో మహిళ మృతి
హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 13 మందిని పొట్టనబెట్టుకున్న ఈ వ్యాధి తాజాగా శుక్రవారం మరో మహిళను బలి తీసుకుంది. స్వైన్ ఫ్లూతో హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేటిదాకా నగరంలోని ఆస్పత్రుల్లో మొత్తం 91 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా 14 మంది మృత్యువాత పడ్డారు. స్వైన్ ఫ్లూ చికిత్సకు సంబంధించిన అన్ని వసతులు అందుబాటులోనే ఉన్నాయని, భయపడాల్సిన పనేమీ లేదని చెబుతున్న వైద్యుల ప్రకటనలు ఏమాత్రం ఫలితాలివ్వడం లేదు.