: కొత్త ఏడాదిలో కొలువుల జాతర... 9.5 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయి!
కొత్త ఏడాదిలో దేశంలో కొలువుల జాతర మొదలు కానుంది. ప్రభుత్వ రంగాన్ని పక్కనబెడితే, ఒక్క ప్రైవేట్ రంగంలోనే దాదాపు 9.5 లక్షల కొత్త కొలువులు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఏడాది నిరుద్యోగులకే కాక ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన వారికి కూడా వారి పనితీరు ఆధారంగా దాదాపు 40 శాతం దాకా వేతన పెంపుతో కూడిన పదోన్నతులు లభించనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోనే కొత్త ఉద్యోగాలు రానున్నాయని మైహైరింగ్.కామ్ తరహా పలు సంస్థలు చెబుతున్నాయి.
ఇక ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన వారికి కూడా ఈ ఏడాది ఆశావహంగానే ఉండనుందట. గతేడాది కేవలం 10 నుంచి 12 శాతం వేతన పెంపుకే పరిమితమైన ఉద్యోగులకు ఈ ఏడాది సగటున 15 నుంచి 20 దాకా వేతన పెంపు లభించనుందని విశ్లేషణలు సాగుతున్నాయి. కొన్ని సంస్థల్లో 40 శాతం వేతన పెంపుతో పదోన్నతులు కూడా ఉద్యోగులకు అందనున్నాయని భావిస్తున్నారు.