: బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ టీజర్లకు సూపర్ రెస్పాన్స్!

యూట్యూబ్ లో టెంపర్, లయన్ టీజర్లు హల్ చల్ చేస్తున్నాయి. నూతన సంవత్సర వేడుక సందర్భంగా విడుదలైన 'టెంపర్', 'లయన్' టీజర్లు యువతను ఆకట్టుకున్నాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టెంపర్'లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. "ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం...ఒక్కడు మీద పడితే అది దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర" అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేల్చిన డైలాగ్ ను టీజర్ గా పూరీ అభిమానుల మీదకు వదిలాడు. దీనిని ప్రముఖ దర్శకుడు రాజమౌళి షేర్ చేయడంతో అది అలా అలా దూసుకుపోతోంది. సత్యదేవ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'లయన్' టీజర్ యూట్యూబ్ లో అత్యంత ఆదరణ చూరగొంటోంది. "కొందరు కొడితే ఎక్స్ రే లో కనపడుతుంది...మరి కొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది... అదే నేను కొడితే...హిస్టరీలో వినపడుతుంది" అనే డైలాగ్ తో బాలయ్య గర్జించాడు. టీజర్ పెట్టి 24 గంటలు కూడా గడవక ముందే లైకులు లక్ష మార్కు దాటేశాయి.

More Telugu News