: చంద్రబాబు, కేసీఆర్ విజన్ ఉన్న నాయకులు: గవర్నర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ విజన్ ఉన్న నాయకులని రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన మాట్లాడుతూ, కొత్త రాష్ట్రాల్లో సమస్యలు సహజమని అన్నారు. అయినప్పటికీ సమస్యలకు వెరవక ముఖ్యమంత్రులు సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
రెండు రాష్ట్రాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకుంటానని ఆయన తెలిపారు. విద్యాశాఖ మంత్రులకు తాను కొన్ని సూచనలు చేశానని, ఎంసెట్ వివాదం సమసిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.