: ద్రవిడ్‌ రికార్డుకు చేరువైన కోహ్లీ... బద్దలుకొట్టేనా?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ పేరిట ఉన్న ఒక రికార్డుకు విరాట్ కోహ్లీ చేరువయ్యాడు. ఒక టెస్టు సిరీస్‌ లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా ద్రవిడ్ పేరిట ఉన్న 619 పరుగుల రికార్డుకు కోహ్లీ 120 పరుగుల దూరంలో ఉన్నాడు. సిడ్నీలో జరిగే నాలుగో టెస్టులో కోహ్లీ రాణిస్తే ద్రవిడ్ రికార్డు బద్దలుకావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, 2003-04 సిరీస్‌ లో నాలుగు టెస్టుల్లో ద్రవిడ్ 619 పరుగులు సాధించాడు. రెండు, మూడు స్థానాల్లో జి.విశ్వనాథ్ 518, వీ.వీ.ఎస్.లక్ష్మణ్ 503 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో కోహ్లీ 499 పరుగులు చేశాడు.

More Telugu News