: ముడతలు వస్తాయని ఈ టెలివిజన్ నటి నవ్వనంటోంది!
ప్రముఖ అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియన్ ఫోటోలకు పోజిచ్చే సమయంలో ఎప్పుడూ నవ్వదట. ఎందుకని అంటే, నవ్వినప్పుడు ముఖంపై ముడతలు ఏర్పడతాయని, అందుకే నవ్వనని చెబుతోంది. అయితే, గతంలో తాను నవ్వినప్పుడు తీసిన ఓ ఫోటోను కిమ్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. "చూడండి, నేను నవ్వగలను... కాకపోతే సందర్భాన్ని బట్టి నవ్వుతాను. కానీ ఎప్పుడూ కాదు. ఎందుకంటే, దానివల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి" అని చెబుతోంది.