: ఇండీ ఫియెస్టా లఘు చిత్రాల అవార్డులకు ఎంట్రీల వెల్లువ

సామాజిక చైతన్యం తేవడంలో సినిమాలది ప్రముఖ పాత్ర అనుకుంటే, ఇప్పుడు సినిమాల గమ్యం మారుతోంది. వాణిజ్య విలువలే ప్రధానంగా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో, సమాజానికి అవసరమైన చైతన్యం అందించే బాధ్యతను షార్ట్ ఫిల్మ్ (లఘుచిత్రం)లు, ఫీచర్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలు తలకెత్తుకున్నాయి. మరోవైపు, సినీ రంగానికి కొత్త రక్తాన్ని పరిచయం చేసేందుకు షార్ట్ ఫిలిం షార్ట్ కట్ గా కనిపిస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యధికంగా లఘు చిత్రాలు తెలుగు నేలపైనే తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో, తెలుగు లఘుచిత్ర పరిశ్రమలోని కొత్త కళాకారులను ముందుకు తీసుకువచ్చేందుకు ఇండీ ఫియెస్టా షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్ ఫంక్షన్ 2015ను నిర్వహించనున్నారు. కేవలం షార్ట్ ఫిల్మ్స్ కు మాత్రమే ఇండీ ఫియెస్టా అవార్డులు ప్రదానం చేయనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇండీ ఫియెస్టా కార్యక్రమానికి సంబంధించిన సమాచారం చక్కర్లు కొడుతోంది. అవార్డులకు పోటీ పడేందుకు నాలుగు వందలకు పైగా ఎంట్రీలు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో రూ.10 లక్షల విలువ చేసే 3 ప్రధాన బహుమతులు, 20 క్యాటగిరీ అవార్డులు, ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు, 10 కన్సోలేషన్ బహుమతులు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు www.indiefiesta.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.

More Telugu News