: 15వ ర్యాంకుకు ఎగబాకిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకుల జాబితాలో కోహ్లీ 15వ స్థానంలో నిలిచాడు. ఇక, ఈ జాబితాలో ఛటేశ్వర్ పుజారా 19, మురళి విజయ్ 20వ స్థానంలో ఉన్నారు. ఫామ్ చాటుకున్న అజింక్య రహానే ఏకంగా 15 స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. ఈ జాబితాలో రహానేది 26వ ర్యాంకు. ఇక బౌలింగ్ విషయానికొస్తే, యువ బౌలర్లు ఉమేశ్ యాదవ్ 36, మహ్మద్ షమి 38వ స్థానంలో ఉన్నారు. టీమ్ విభాగంలో భారత్ 6వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతుండగా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి.

More Telugu News