: 'ధోనీ రిటైర్మెంటు'లో కొత్త కోణం!

టెస్టు క్రికెట్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంటు ప్రకటించగా, ఆ అంశంలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కోహ్లీ నాయకత్వంలో ఆడడం ఇష్టంలేకే గుడ్ బై చెప్పాడన్న వాదనలు బయల్దేరాయి. గత కొన్నేళ్లుగా టీమిండియా విదేశీ గడ్డపై టెస్టుల్లో విఫలమవుతోంది. గెలవాల్సిన టెస్టుల్లోనూ చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంటున్నారు. దీంతో, ధోనీ నాయకత్వ పటిమపై సందేహాలు బయల్దేరాయి. ధోనీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవాలంటూ మాజీలు సలహాలివ్వడం ప్రారంభించారు. ధోనీ సారథ్యం వీడితే కోహ్లీకి ఆ బాధ్యతలు అప్పగించాలని గవాస్కర్, గంగూలీ తదితరులు సూచించారు కూడా. అదే జరిగితే ధోనీ తన కన్నా జూనియర్ అయిన కోహ్లీ కెప్టెన్సీలో టెస్టులాడాల్సి ఉంటుంది. అలా ఆడడం ఇష్టంలేకే ధోనీ ఏకంగా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. ధోనీ ఇప్పటికిప్పుడు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటాడని అసలు ఊహించలేదని గంగూలీ అన్నాడు. సిిరీస్ జరుగుతుండగా ధోనీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు. కెప్టెన్సీ వదులుకోవడం సరైన నిర్ణయమేనని, అయితే, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం మాత్రం సరికాదని దాదా అభిప్రాయపడ్డాడు.

More Telugu News