: ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంత తొందరేమీలేదు: పీడీపీ అధినేత్రి
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంత తొందరేమీ లేదని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తో కేవలం ఇది అనధికారిక సమావేశమని, ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. "జమ్మూ కాశ్మీర్ ఓ నిర్ణయాత్మకమైన, అదే విధంగా విభేదాత్మకమైన తీర్పు ఇచ్చింది. అయినా మాకు 55 ఎమ్మెల్యేల మద్దతు ఉంది" అని ముఫ్తీ వివరించారు.