: 30 మీటర్ల అడుగున ఎయిర్ ఏషియా విమానం!

జావా సముద్రగర్భంలో ఒక పెద్ద వస్తువు ఉన్నట్టు కనుగొన్నామని... దాన్ని అదృశ్యమైన ఎయిర్ ఏషియా తాలూకు విమాన శకలంగా అంచనా వేస్తున్నామని ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది. నల్లగా కనిపిస్తున్న ఈ వస్తువు సముద్ర ఉపరితలానికి 30 నుంచి 50 మీటర్ల అడుగున ఉందని ఓ అధికారి తెలిపారు. అది విమానమే అయితే మరింత త్వరగా పని పూర్తి చేయవచ్చని ఆయన అన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని ఆయన వివరించారు.

More Telugu News