: కట్టు తప్పితే కఠిన చర్యలు తప్పవు: బీజేపీ ఢిల్లీ శాఖ నేతలకు అమిత్ షా వార్నింగ్

త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ఏమాత్రం కట్టు తప్పినా కఠిన చర్యలు తప్పవంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. సీట్ల కోసం లాబీయింగ్, పార్టీలో అంతర్గత కలహాలను ఎంతమాత్రం సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ టికెట్లిచ్చిన నేతల విజయం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాల్సిందేనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ కార్యవర్గ సదస్సు ముగింపు సందర్భంగా మంగళవారం మాట్లాడిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పలు సలహాలు, సూచనలు చేశారు. పార్టీ విజయమే పరమావధిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గడచిన ఆరు నెలల్లో దేశ ప్రజల అంచనాల మేరకు పనిచేశామని చెప్పిన ఆయన రానున్న బడ్జెట్ లో ఢిల్లీ ప్రజలకు ఉపకరించే పలు పథకాలను ప్రకటించనున్నామని తెలిపారు.

More Telugu News