: తిరుపతిలో పాదచారులపైకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు... ఐదుగురికి గాయాలు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కొద్దిసేపటి క్రితం ఓ టూరిస్టు బస్సు బీభత్సం సృష్టించింది. నగరంలోని శ్రీనివాసం సమీపంలో, వేగంగా వచ్చిన టూరిస్టు బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే శ్రీనివాసం సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ముగ్గురు వ్యక్తులకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి వీరిని అధికారులు హుటాహుటిన నగరంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. టీటీడీ ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.