: హైటెక్ సిటీ దగ్గర 10 డిగ్రీల ఉష్ణోగ్రత

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను చలి వణికిస్తోంది. గత రాత్రి హైటెక్ సిటీ ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరి కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయని సమాచారం. చలి దెబ్బకు హైదరాబాద్ వాసులు ముడుచుకుపోయారు. తెల్లవారుజామున వాకింగ్ చేసేవారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 9 గంటల సమయంలో కూడా మంచు తెరలు వీడలేదు.

More Telugu News