: నేడు సాయంత్రం దాకా అసెంబ్లీ సమావేశాలు... కీలక బిల్లులపై చర్చ

ఏపీ శాసనసభ నేడు సాయంత్రం దాకా కొనసాగనుంది. శీతాకాల సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన శాసనసభ, మండలి సమావేశాలు సాయంత్రం దాకా కొనసాగనున్నాయి. సీఆర్డీఏ, విద్యాహక్కు సవరణ చట్టం, వ్యాట్ తదితర చట్టాలపై నేడు కీలక చర్చ జరగనున్న నేపథ్యంలో సమావేశాలను సాయంత్రం దాకా కొనసాగించాలని తీర్మానించారు. ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును ప్రభుత్వం నేడు మండలిలోనూ ప్రవేశపెట్టనుంది. మరోవైపు నేటి సమావేశాల్లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీపై ప్రకటన చేయనున్నారు.

More Telugu News