: కీలక బిల్లుల ఆమోదానికి విపక్షాలు మోకాలడ్డుతున్నాయి: వెంకయ్యనాయుడు

ప్రభుత్వ పాలనలో పలు కీలక సంస్కరణలకు దోహదం చేసే బిల్లుల ఆమోదానికి విపక్షాలు మోకాలడ్డుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. లోక్ సభలో తమకు స్పష్టమైన ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఒక్క సెషన్ లోనే రికార్డు స్థాయిలో 17 కీలక బిల్లులకు ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. రాజ్యసభలో కాస్త ఎక్కువ బలం ఉన్న విపక్షాలు, కీలక బిల్లులకు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రస్తుత సెషన్ లో రాజ్యసభలో 11 బిల్లులకు మాత్రమే ఆమోదం లభించడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలని వెంకయ్య సూచించారు.

More Telugu News