: ఏపీలో అమరావతి...తెలంగాణలో ఓరుగల్లుకు హెరిటేజ్ సిటీల హోదా: వెంకయ్య

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, తెలంగాణలో వరంగల్ నగరాలకు హెరిటేజ్ సిటీల హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పురాతన నగరాలుగా ఎంపికైన అమరావతి, వరంగల్ నగరాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులివ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండు నగరాల్లో పేదల గృహ నిర్మాణం కోసం అవసరమైనంత మేరకు నిధులు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

More Telugu News