: మణిపూర్ లో బాంబు పేలుడు... ముగ్గురు మృతి

మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో బాంబు పేలుడు జరిగింది. నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పేలుడు ఘటనకు కారకులెవరన్న విషయం తెలియరాలేదు.

More Telugu News