: బలవంతపు మతమార్పిడులకు మేం వ్యతికేకం: బీజేపీ చీఫ్ అమిత్ షా

బలవంతపు మత మార్పిడులకు తాము వ్యతిరేకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. బలవంతపు మత మార్పిడులను నిషేధిస్తూ తమ ప్రభుత్వం రూపొందించనున్న బిల్లుకు ఇతర రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. లౌకిక పార్టీలుగా ప్రచారం చేసుకుంటున్న పార్టీలు ఈ విషయంలో ముందుకురావాలని ఆయన కోరారు. మత మార్పిడుల బిల్లుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తామని ఆయన శనివారం చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో ‘ఘర్ వాపసీ’ పేరిట హిందూ అనుకూల వర్గాలు చేపట్టనున్న మత మార్పిడుల అంశం కోర్టు పరిధిలో ఉందని ఆయన చెప్పారు.

More Telugu News