: ఓటు హక్కు విలువను చాటిన 110 ఏళ్ల వృద్ధుడు
లంబసింగి వంటి ప్రాంతాల్లోనే ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయాయి. అలాంటిది జమ్మూకాశ్మీర్ లో వాతావరణం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎముకలు కొరికే చలి... బయటకు రావాలంటే యువకులే జంకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని 110 ఏళ్ల వృద్ధుడు ఓటుహక్కు విలువను చాటి చెప్పారు.
చౌదరిఖరా గ్రామానికి చెందిన మునిష్ ఖాన్ అనే 110 ఏళ్ల వయో వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం తాను ఓటేసేందుకు వచ్చానని ఆయన పేర్కొన్నారు.