: జార్ఖండ్ ఆఖరి విడత ఎన్నికలో 63 శాతం పోలింగ్
జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 16 నియోజకవర్గాల్లో మూడు గంటలకల్లా పోలింగ్ ముగిసింది. చివరి విడత కావడంతో ప్రజలు ఉత్సాహాంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఆఖరి దశలో 63.94 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరోవైపు జమ్ము కాశ్మీర్ లో చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది.