: బీజేపీలో చేరనున్న ఇళయరాజా సోదరుడు

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు పర్యటనకు వస్తున్నారు. ఆయన సమక్షంలో గంగై అమరన్ కమలదళంలో చేరనున్నారు. పార్టీలో చేరిక విషయమై ఈ సంగీత దర్శకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు తమిళసై సౌందరరాజన్ తోనూ చర్చించారు. తమిళంలో ఎన్నో చిత్రాలకు సంగీతం అందించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగులో వంశీ దర్శకత్వంలో వచ్చిన 'స్వరకల్పన' సినిమాకు బాణీలు కూర్చారు. గంగై అమరన్ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేగాకుండా, పాటలు కూడా రాయడం విశేషం.

More Telugu News