: మాజీ ఎమ్మెల్యే విష్ణుకు బెయిల్ మంజూరు

మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డికి రంగారెడ్డి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి చేసిన కేసులో విష్ణుపై అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్టు తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదోపవాదాలు ముగిశాయి. తనకు సోమవారం వరకు సమయం ఇస్తే కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసిన ఘటన తాలూకు సీసీ కెమెరా ఫుటేజ్ ను సమర్పిస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల విష్ణుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కాగా, తన క్లయింటు సచ్ఛీలుడని, గతంలో వివాదాలు లేవని, కేసులు కూడా లేవని, న్యాయస్థానానికి అన్ని విధాలా సహకరిస్తాడని విష్ణు తరపు న్యాయవాది కోర్టుకు వివరించాడు. దీంతో, అతడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

More Telugu News