: మరో మూడు నెలలు జైల్లోనే లఖ్వీ
నిన్న బెయిల్ పొందిన ముంబయి అల్లర్ల సూత్రధారి జకియుర్ రెహ్మాన్ లఖ్వీ మరో మూడు నెలలు జైలులోనే గడపాల్సి వుంటుంది. లఖ్వీకి బెయిల్ మంజూరు తరువాత భారత్ తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున విమర్శలు రావడంతో మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (ఎంపీవో) కింద మూడు నెలల పాటు అతడిని నిర్బంధంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి లఖ్వీ ఈరోజు ఉదయం రావల్పిండి జైలు నుంచి విడుదల కావలసి ఉంది. లఖ్వీ నిర్బంధం విషయంపై పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి కూడా సమాచారమందించింది.