: జీఎస్ఎల్వీ మార్క్-3 క్రూ మాడ్యూల్ ని రికవర్ చేసుకున్న ఇస్రో

అంతరిక్షంలోకి మానవులను పంపడంలో భాగంగా జీఎస్ఎల్వీ మార్క్-3ని ఇస్రో నిన్న విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుంచి వ్యోమగాములు భూమి మీదకు ల్యాండ్ అయ్యే ప్రయోగంలో భాగంగా వారు ప్రయాణించే క్రూ మాడ్యూల్ ని బంగాళాఖాతంలోకి జారవిడిచారు. శ్రీహరి కోటకు 1600 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ పడింది. ప్రత్యేక విమానం ద్వారా విహంగ వీక్షణం చేసి, క్రూ మాడ్యూల్ ని గుర్తించారు. అనంతరం, అండమాన్ నికోబార్ దీవుల్లో సిద్ధంగా ఉంచిన రక్షణ శాఖ నౌకను ఉపయోగించి దాన్ని వెలికితీసి, అదే నౌకలో తమిళనాడులోని ఎన్నూరు పోర్టుకు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో షార్ అంతరిక్ష కేంద్రానికి తరలించనున్నారు.

More Telugu News