: 2015లో హోండా నుంచి 10 కొత్త మోడల్ బైక్స్
వచ్చే ఏడాది పది కొత్త మోడల్ మోటారు సైకిళ్లను హాండా మోటార్స్ విడుదల చేయనుందని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వెల్లడించింది. ఢిల్లీలోని సీబీ యూనికార్న్ అప్ గ్రేడ్ వెర్షన్ 160 సీసీ బైక్ విడుదల కార్యక్రమంలో ఆ సంస్థ ఇండియా సీఈవో మురామత్సు మాట్లాడుతూ, 2015లో హోండా ఏడు కొత్త మోడల్ బైకులను, మూడు పాత వాహనాలకు అప్ గ్రేడ్ వెర్షన్లను విడుదల చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం హోండా కంపెనీకి సంబంధించిన 20 మోడల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.