: గన్నవరంలో ఎన్ఐటీ, తాడేపల్లి గూడెంలో ట్రిపుల్ ఐటీ: గంటా
రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు నిమిత్తం తక్షణం చర్యలు చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. నేటి ఉదయం అసెంబ్లీ వాయిదాపడ్డ అనంతరం ఆయన మాట్లాడుతూ, గన్నవరంలో ఎన్ఐటీ, తాడేపల్లిగూడెంలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధతను ప్రస్తావిస్తూ, తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన తేదీల్లో పరీక్షలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కూడా సిద్ధంగా ఉందని సమాధానమిచ్చారు. ఎంసెట్ పరీక్షను ఉమ్మడిగానే నిర్వహించాలని, విభజన చట్టంలో నిబంధన ఉందని ఆయన గుర్తుచేశారు.