: చేతనైతే ప్రధానితో ప్రకటన చేయించండి: విపక్షాలు
మతమార్పిడులపై రాజ్యసభ అట్టుడికింది. బీజేపీ నేతలు మతమార్పిడులపై చట్టం చేయాలంటూ ప్రకటనలు గుప్పిస్తుండడంతో పార్లమెంటు ఉభయ సభల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. దీంతో చేతనైతే ప్రధానితో ప్రకటన చేయించండంటూ విపక్షాలు అధికారపక్షానికి సవాలు విసురుతున్నాయి. అధికార పక్షం దురహంకారంతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మండిపడుతుండగా, విపక్షాలు దురహంకార ధోరణి వీడాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో అధికార, విపక్షాల వాగ్వాదంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాగా చర్చకు ప్రధాని హాజరుకావడం విశేషం.