: తమిళనాడులో నిరాహారదీక్షకు దిగిన మందుబాబుల సంఘం

ఇదో సరికొత్త సంఘం! మందుబాబుల కోసమే ఏర్పాటైన ప్రత్యేక సంఘం! చెన్నైలో ఏర్పాటైన ఈ సంఘం పేరు 'తమిళనాడు మద్యపాన సేవకుల అవగాహన సంఘం'. సంఘం అన్న తర్వాత నిరసనలు, ఆందోళనలు చేయాల్సిందే. వీరు కూడా చేశారు. మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని నిరసిస్తూ నగరంలోని చేపాక్కంలో బుధవారం నిరాహార దీక్షకు దిగారు. సంఘం ప్రతినిధి నీలకంఠన్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. పెంచిన ధరలతో లభించే ఆదాయాన్ని ఏ సంక్షేమ పథకాలకు వినియోగిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము మద్యం తాగడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోందని, అలాంటప్పుడు ఇతర వస్తువుల ధరలు పెంచడం ఎందుకంటూ నిలదీశారు. అంతేగాకుండా, మద్యం తాగి ఎవరైనా మృతి చెందితే ఆ వ్యక్తి కుటుంబానికి నెలకు రూ.5000 పింఛన్ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలన్నారు.

More Telugu News