: ప్రేయసిని మరువలేక భార్యను ఒంటరిని చేశాడు!
ప్రియురాలిని మరచిపోలేక కట్టుకున్న భార్యను ఒంటరిని చేసి ఆత్మహత్య చేసుకున్నాడో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరానగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ‘'ప్రేమించిన అమ్మాయి నాకెంతో సాయం చేసింది. ఆమె లేకుంటే ఎప్పుడో చనిపోయేవాడిని, ఆమె నాతో లేకపోవడం ప్రాణం పోయినట్లుగా అనిపిస్తోంది. ఆ అమ్మాయిని తప్ప మరెవరినీ మనసులో ఊహించుకోలేకపోతున్నా’' అని సూసైడ్ నోట్ రాసి సంగెపు రవీంద్రనాథ్ (26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీంద్రనాథ్ హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భార్య డెంటల్ డాక్టర్. వీరికి ఆగస్టులో వివాహం జరిగింది. రవీంద్రనాథ్ బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.