: ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు ఆర్బీఐ లక్షల్లో జరిమానా

నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. లక్షల్లో జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. 50 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 25 లక్షల జరిమానాలు వడ్డించింది. కేవైసీ నిబంధనలను బ్యాంకులన్నీ కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని గతంలో పలుమార్లు ఆర్బీఐ హెచ్చరించింది. అయినా ఈ రెండు బ్యాంకులు బేఖాతరు చేయడంతో ఆర్బీఐ జరిమానా విధించింది.

More Telugu News