: భారతీయుల సంపద రూ. 257 లక్షల కోట్లు: కార్వీ నివేదిక

ప్రస్తుతం భారతీయుల సంపద రూ. 257.4 లక్షల కోట్లుగా ఉందని 'కార్వీ ఇండియా వెల్త్' నివేదిక వెల్లడించింది. ఇందులో చరాస్తుల (షేర్లు, ఈక్విటీలు, నగదు, బ్యాంకు డిపాజిట్లు,...) విలువ రూ. 134.7 లక్షల కోట్లు కాగా... స్థిరాస్తుల (భూములు, కట్టడాలు, బంగారం తదితర లోహాలు, వజ్రాలు,...) విలువ రూ. 122.7 లక్షల కోట్లని తేల్చింది. దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో... రానున్న ఐదేళ్లలో ఈ మొత్తం రెట్టింపవుతుందని అభిప్రాయపడింది. ఏటా 15 శాతం వృద్ధితో ఐదేళ్లకు భారతీయుల సంపద రూ. 500 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. గడచిన ఐదేళ్లలో భారతీయుల సంపద 84 శాతం పెరిగిందని తెలిపింది.

More Telugu News