: జగన్ కు లీగల్ నోటీసిచ్చిన అనంతపురం ఎమ్మెల్యే
వైకాపా అధినేత జగన్ కు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి లీగల్ నోటీసిచ్చారు. సొంత పత్రిక, ఛానల్ అయిన సాక్షిలో వస్తున్న తప్పుడు కథనాలకు జగనే బాధ్యత వహించాలని నోటీసులో ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. తన తప్పును ఒప్పుకుని జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.