: 20 ఏళ్లకు తీరిన ఇంద్రకరణ్ కల... పదేళ్ల తర్వాత తుమ్మలకు మరోసారి మంత్రి యోగం

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి కావాలన్న కల 20 ఏళ్లకు గానీ ఫలించలేదు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలో కీలక పదవులను అలంకరించిన ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి మాత్రం నిన్నటిదాకా అందని ద్రాక్షగానే మారింది. అయితే, కేసీఆర్ సానుకూలత నేపథ్యంలో, దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన కల ఫలించింది. నేటి మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణం చేసిన ఇంద్రకరణ్ రెడ్డికి కీలక శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఇక, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు విషయానికొస్తే, దాదాపు పదేళ్ల తర్వాత కానీ ఆయనకు రెండోసారి మంత్రి పదవి దక్కలేదు. టీడీపీలో ఉండగా చంద్రబాబు కేబినెట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తుమ్మల పనిచేశారు.

More Telugu News