: కోల్ స్కాంలో మాజీ ప్రధాని మన్మోహన్ ను ప్రశ్నించేందుకు కోర్టు ఆదేశం
బొగ్గు కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ స్కాంలోని హిందాల్కో కేసులో నాడు బొగ్గు శాఖను పర్యవేక్షించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ పాత్రపైన దర్యాప్తు కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో జనవరి 27న దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది.