: బుడ్డోడు బడికి బుల్లెట్లు తెచ్చాడు!

ఆ బుడ్డోడు ఇంకా ఆరో తరగతి కూడా పూర్తి చేయలేదు. అప్పుడే బడికి బుల్లెట్లతో వచ్చేశాడు. అంతేనా, ప్రమాదకరమైన బుల్లెట్లను ఆ బుడతడు తన తోటి విద్యార్థులకు పంచిపెట్టాడు. తరగతి గదిలో జరుగుతున్న ఈ తంతు చూసి టీచరమ్మ షాక్ కు గురైంది. వెనువెంటనే ఆ బుడతడిని మందలించి, బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కు సమాచారాన్ని చేరవేసింది. విషయం తెలిసిన మీడియా అక్కడికెళ్లగా, 'అబ్బబ్బె అలాంటి ఘటనేమీ జరగలే'దంటూ పాఠశాల యాజమాన్యం బుకాయించింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటుచేకుంది. పాఠశాలకు బుల్లెట్లతో వచ్చిన బుడతడి తండ్రి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడట. తండ్రి ఇంట్లో పెట్టిన బుల్లెట్లనే అతడు బడికి తెచ్చి ఉంటాడని భావిస్తున్నారు.

More Telugu News