: జగన్ కేసులో మరో రూ.47 కోట్ల ఆస్తులు జప్తు

అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన మరో రూ.47 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే పలు దఫాలుగా జగన్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ, నేడు మరోమారు ఆయనకు చెందిన రూ.47 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసిందని పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, పలు పారిశ్రామిక సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేసి జగన్ ఆయాచిత లబ్ధి పొందారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తునకు సమాంతరంగా ఈడీ కూడా ఈ కేసుపై దర్యాప్తు సాగిస్తోంది. ఈ కేసులో జగన్ 16 నెలల పాటు జుడీషియల్ రిమాండులో కూడా గడిపారు.

More Telugu News