: పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కొప్పుల ఈశ్వర్
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఈ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనతో అన్ని విషయాలు సీఎం మాట్లాడారన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కేసీఆర్ ఏ పదవి కట్టబెట్టినా పని చేస్తానని తెలిపారు. ఆయన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. తన భవిష్యత్తుపై సీఎం సముచితమైన ఆలోచన చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా విషయంపై స్పష్టత వస్తుందన్నారు. బంగారు తెలంగాణకోసం తన వంతు కృషి చేస్తానని ఈశ్వర్ పేర్కొన్నారు.