: చక్రి భౌతికకాయానికి నివాళి అర్పించిన బాలకృష్ణ

సంగీత దర్శకుడు చక్రి భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చక్రి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి, నమస్కరించి, నివాళి అర్పించారు. టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, రమణలు కూడా చక్రిని చివరిసారిగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రమణ మాట్లాడుతూ, చక్రి పేరిట స్మారక స్థూపం కాని, మ్యూజియం కానీ నిర్మించాలని సూచించారు.

More Telugu News