: చక్రి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

ప్రముఖ సినీ దర్శకుడు చక్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే చక్రి తనువు చాలించటం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తన కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చక్రి అని తెలిపారు. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అతని కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. 40 ఏళ్ల చక్రి కాసేపటి క్రితం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు.

More Telugu News